Thursday, March 24, 2016

స్కిన్ గ్లో ?

ఒక్క రోజులో స్కిన్ గ్లో గా మెరుస్తూ ఉండాలి అంటే 2 స్పూన్స్ పాలు,1 టమోటా ని కలిపి పేస్ కి పట్టించి 15 నిముషాలు ఆరిన తరువాత పేస్ ని చల్లటి నీరు తో కడగండి.గ్లో చూసుకోండి.ఇలా రోజు చేయటం వలన గ్లో పెరుగుతూ వస్తుంది.

మీ కోసం మరిన్ని చిట్కాలు:- 


  • 2 స్పూన్స్ పెరుగు లో 1 స్పూన్ శనగపిండిని కలిపి రాయండి.చర్మం మెరుస్తూ ఉంటుంది.
  • 2 స్పూన్ పాలు లో 2 స్పూన్స్ శనగపిండి ని కలిపి రాసుకోండి.జిడ్డు పోయ్ మెరుస్తూ ఉంటుంది.
  • కొబ్బరినునె లో పసుపు కలిపి పేస్ కి పట్టించి 15-20 నిముషాలు ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగటం వలన స్కిన్ గ్లో ఒస్తుంది.

7 రోజుల్లో 5 కేజీలు తగ్గండి ?


ఇది చాలా ముఖ్యముగా గర్భం తరువాత పొట్ట దగ్గర ఉండే కొవ్వు ను తగ్గించుకోవటం చాలా కష్టం.
దీనికి కొన్ని ఆహారపు మార్పులు చేయాల్సి ఉంది.
పొట్ట దగ్గర కొవ్వు ను పోగొట్టుకోవటానికి ఎలా చేసి చూడండి?
ఈ పానీయములో పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కోల్పోవటానికి సహాయపడుతుంది.
ఈ పానీయం మీ శక్తి ని  పెంచటానికి వ్యాయము ఫలితాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది మీరు కొన్ని నిమిషాలలోనే తాయారు చేసుకోవచ్చు .

తయారి విధానం:-

నిమ్మరసం లో కొంచము కొతిమీర రసం వేసి కలపాలి.తరువాత 1/2 కప్పు నీరు ని తీసుకొని ఆ రసం లో బాగా మిక్స్ చేయాలి.
దీని వలన క్రింది లాబాలను పొందుతారు.

లాబాలు:-

శరీరం లో జీర్ణశక్తి,కొతిమీర లో అనేక విటమిన్ లు ఉంటాయి.అలానే నిమ్మరసం లో శరీరం లో ఉండే విష పదార్ధాలు (టాక్సిన్)ను బయటకి పంపిస్తుంది.శరీరం లో ఉండే అదనపు నీటిని తొలిగించటం లో సహాయ పడుతుంది.
ఈ పానీయాన్ని పొద్దున లేవగానే పరగడుపుతో తాగటం మంచిది.
మీరు ఈ పానీయం తో రోజు ని మొదలు పెట్టండి.
వరుసగా 5 రోజులు తాగాలి.
5 రోజులు తాగిన తరువాత 10 రోజుల విరామం తరువాత మళ్ళి 5 రోజులు పునరావృతం చేయండి.
ఈ పానీయం తో పాటు ఎక్కువ నీరు ని,గ్రీన్ టీ తాగటం వలన బరువు ఇట్టె తగ్గచు.
మీరు కోరుకున్న ఫలితాన్ని సాధించే వరకు ఇది కొనసాగించండి.

Tuesday, March 22, 2016

ఏమి చేయకుండానే వెయిట్ తగ్గించుకునే మార్గాలు ?

వెయిట్ తగ్గటం కోసం మనం ఎన్నో చేస్తూనే ఉంటాం.కానీ సింపుల్ గా వెయిట్ ఇట్టే తగ్గచ్చు.ఎలా అని ఆలోచిస్తునారా.

సెల్ఫి దిగటం:

సెల్ఫి దిగటం వలన 4 నెలలో శరీరబరువు 2.6 శాతం తగ్గే అవకాసం ఉంది.ఇటివలే స్పానిష్ అధ్యనం చూచిస్తుంది.

యాపిల్ :

మీరు షాపింగ్ చేసే ముందు ఒక యాపిల్ ని తినటం వలన 28% తక్కువ జంక్ ఫుడ్ తినటానికి  ఇష్టపడతారు.

వెయిట్ చెక్:

క్రమం తప్పకుండా  వెయిట్ చెక్ చేయటం వలన బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.ఇయర్ కి 3-4 కేజీలు బరువు తగ్గచు.

నడక :

రోజు 30 నిముషాలు సరదా నడక వలన 12 వరాల లో 1.6 ఇంచెస్ నడుము కొలత తగ్గే అవకాసం ఉంది.

బాదం పప్పు:

జంక్ ఫుడ్ తినటం మానేసి రోజు నాన పెట్టిన  3-5  బాదం పప్పు లు తినుట వలన వెయిట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.

నిద్ర :

బరువు తగ్గలనుకునే వారికీ నిద్ర చాల కీలకం.కంటి నిండా నిద్ర పోవటం వలన వెయిట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.పై పనులు మనం ఏమి కష్టపడకుండా చేసే పనులే

వేసవి లో తీసుకోవాల్సిన జాగ్రతలు?



ఈ వేసవి లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.50 డిగ్రీలు పైనే ఉంటుంది.అందరూ ఎండ తీవ్రత నుండి ఉపసమనం పొందటానికి ఇలా చేయండి.వేడి కూడా తగ్గుతుంది.పిల్లలను వడదెబ్బ తగలనియకుండా జాగ్రత పడండి.
నీరు ని ఎక్కువ తాగటం అలవాటు చేసుకోండి.
మజ్జిగను తాగటం వలన వేడి తగ్గుతుంది.మజ్జిగను మీకు నచ్చిన లాగా చేసుకోండి.
ఉదాహరణ: లస్సీ ,బట్టర్ మిల్క్
శీతలపానీయాలను త్రాగకండి.పండ్లరసాలను తాగటం చాల మంచిది.
నిమ్మరసం తాగటం వలన కూడా ఉపసమనం కలుగుతుంది.
బార్లినీరు తాగటం వలన కూడా వేడి తగ్గి యురిన్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
సగ్గుబియ్యం ని కూడా తాగటం వలన కూడా వేడి తగ్గుతుంది.

Wednesday, March 16, 2016

జుట్టు పెరుగుదల కోసం ఇలా చేయండి?

జుట్టు పెంచుకోవటానికి ఎన్నో పాట్లు పడుతుంటాం.
ఎన్నో షాంపూలు,కండిషనర్లు వాడుతూ ఉంటారు.ఇప్పుడు కొత్తగా విటమిన్ టాబ్లెట్లు కూడా మార్కెట్ లో కి వస్తున్నాయ్.అలా బాధ పడే వాళ్ళు ఇలా చేసి చూడండి

నునె:-

వారానికి ఒకసారి తలకి నునె బాగా పట్టించాలి.

మందారం :-

మందార ఆకులని రుబ్బి తలకి పట్టించి తల అంటుకోండి.ఇలా వారానికి ఒక సారి చేయటం వలన జుట్టు పెరుగుతుంది .ఎలాంటి కండిషనర్లు వాడకుండా జుట్టు సిల్క్ గా ఉంటుంది.

పెరుగు,నిమ్మరసం  :-

తల అంటుకునే ఒక అర గంట ముందు తలకి పెరుగు,నిమ్మరసం కలిపి పట్టించటం వలన జుట్టు పొడిగా ఉండకుండా,మెరుస్తూ,చుండ్రు లేకుండా నివారిస్తుంది.అలాగే వేడి కూడా తగ్గుతుంది.

గుడ్డు:-

గుడ్డు లో ని తెల్ల సొన ని తలకి పట్టించటం వలన జుట్టు సిల్క్ గా ,జుట్టు నిగనిగలాడుతుంది.

                                 ఇలా వారానికి ఒక సారి చేయటం వలన జుట్టు పెరుగుతుంది. 

వెయిట్ లాస్ కొరకు నిమ్మరసం తాగటం వలన వచ్చే ఇబ్బందులు తెలుసా?


మనం రోజు లేవగానే నిమ్మరసం తాగటం వలన కాలరీలు తగ్గుతాయి.కాన్సర్ ని ఎదురుకొనగలిగిన ఆమ్లాలు నిమ్మరసం లో ఉంటాయి. దీనిలోవిటమిన్ సి ఆమ్లం ఎక్కువ ఉంటుంది.కాని మీరు నిమ్మరసం తాగటం వలన బరువు తగ్గుతారు.శరీరంలోని విషఫలితాలను తొలగిస్తుంది అని అనుకోవటమే కాని ఎలాంటి ఆధారాలు లేవు.అవన్నిపక్కన పెడితే నిమ్మరసం తాగటం వలన వచ్చే అనార్ధాలు తెలుసుకోండి.

నిమ్మరసం రోజు కి 4 గ్లాసులు తాగటం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:- 

కడుపులో మంట ,ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లాలు ఎక్కువ ఉంటాయి.
పళ్ళ ఎనమెల్ పోతుంది మరియు క్యావిటి దెబ్బ తింటుంది.
 క్యావిటి దెబ్బ తినటం వలన పళ్ళు వేడిని,చల్లదనాన్ని తట్టుకునే శక్తి పోతుంది.


                                        నిమ్మరసం కి వ్యతిరేకం కాదు కాని ఇది సత్యం 

Tuesday, March 15, 2016

చుండ్రు ని పోగొట్టుకోండి ఇలా ??

ఈ రోజు న చుండ్రు బాగా వేదిస్తుంది.చుండ్రు ని తగ్గించటానికి చాల షాంపూ లు వాడుతుంటాం.వాటి కన్నాఇంట్లో నే చుండ్రు ని తగ్గించటానికి కొన్ని చిట్కాలు పాటించండి.
చుండ్రు ని పోగొట్టుకోవటానికి చిట్కాలు

వేపాకు:-

వేపాకు ని నూరి దానికి తలకి పెట్టటం వలన బాగా మంచి ఫలితం వస్తుంది.

టమోటా:-

చుండ్రు విపరీతంగా ఉంటె టమోటాలను పేస్టు చేసి తల కి పట్టించండి.మర్దన చేయండి.ఫలితం ఉంటుంది.

జుట్టు ఉడకుండా ఉండాలంటే??

ఈ రోజుల్లో జుట్టు బాగా ఉడుతుంది అని తెగ బాధ పడుతూ ఉంటారు.ఇది వయ్యసు లో ఉన్న పిల్లలకి ఈ సమస్య బాగా ఎక్కువ గా ఉంటుంది అందుకని ఇలా చేసి చూడండి.తల అంటుకునే అర గంట ముందే నూనే రాయటం వలన చాల ఉపయోగాలు ఉన్నాయ్ బలం గా ఉంటాయి.అలాగే తల అంటుకున్నాక తలను తడిగా వుంచుకోకండి.దీని వల్ల చుండ్రు వస్తుంది.తల పొడిగా అయ్యాక నే దువ్వెన తో దువ్వుకోవాలి. లేదు అంటే తడి మీద వెంట్రుక ఎక్కువ ఉడుతుంది.

 చిట్కా:-

జుట్టు ఉడకుండా ఉండటానికి  వేప ఆకూ,మందారం,కరివేపాకు కలిపి రుబ్బి పెరుగు లో కలుపుకొని రాయటం వలన ఉడకుండా ఉంటుంది.వారానికి ఒక సారి ఇలా చేస్తూ ఉండండి. 

Monday, March 14, 2016

దానిమ్మ గురించి మీకు తెలియని నిజం ?

దానిమ్మపండు తిన్న వెంటనే శక్తి ని ఇస్తుంది.దానిమ్మ రసం తాగటం వలన రక్తం పడుతుంది.మనకకి తెలియని నిజం ఏమిటి  అంటే జీగట విరోచనాలు,రక్త  విరోచనాల కి దానిమ్మ బాగా పని చేస్తుంది.వెంటనే వాటి నుడి ఉపసమనం కలుగుతుంది.స్కిన్ మెరుస్తూ నీగ నీగ లాడుతూ ఉంటుంది .ఎక్కువ దానిమ్మ రోగాలని దరిచేరనివ్వకుండా పని చేస్తుంది .అందువలన రోజు ఒక దానిమ్మ తినటం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోండి.  

ఇవి తినుట వలన గుండె సేఫ్ ?

ఈ రోజుల్లో చాల మంది కి హార్ట్ ఎటాక్  వస్తుంది .అది వయసు తో సంబంధం లేకుండా పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది .అందుకనీ మనం చిన్నపాటి ఆహార నియమాలని పాటించాలి.ఎక్కువగా చిన్న పిల్లలకి ఈ భారిన పడకుండా ముందు నుండే కాపాడుకుందాం .మీరు ఏమి చేయాలి అని ఆలోచించకండి

యాపిల్:-

 రోజు పిల్లల కి యాపిల్ ,దాక్షా వాళ్ళ ఆహారం లో ఇవ్వటం వలన గుండె సేఫ్ గా ఉంటుంది.పిల్లలకే కాదు వయసు తో సంబంధం లేకుండా తినచ్చు.రోజు యాపిల్ తీసుకోవటం వలన శరీరం కి కూడా చాల మంచిది అని డాక్టర్లులు చెపుతున్నారు.

దాక్షా:-

ఇక దాక్షా లో చెక్కర ,ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి.ఫీవర్ కి చక్కని మందు లాగా ఉపయోగపడుతుంది.వేసవి లో దాక్షా పానీయాలు తాగటం వలన చాల మంచిది.కీళ్ళ నొప్పులు కూడా దూరం అవుతాయి.అలానే మీ గుండె కూడా సేఫ్ 

Sunday, March 13, 2016

శక్తి ని పెంచుకోవటం ఎలా ???


అవును మీరు విన్నది నిజం .....ఎలా అని ఆలోచిస్తునారా !!!
మనం రోజు స్వీట్ లు తింటూ ఉంటాం. కానీ వాటి వాళ్ళ ఏమి ఉపయోగం ఉండదు .మనం మన  జీర్ణ శక్తి ని పెంచుకుందాం.అది ఎంటో తెలుసుకోండి .

బెల్లం...

నిజం బెల్లం వలన శక్తి వస్తుంది..
బెల్లం లో ఇనుము పోషకాలు ఎక్కువ ఉంటాయి...అలసట రాకుండా తక్షణ శక్తి ని కలిగిస్తుంది.శరీరం లో వేడిని కూడా తగ్గిస్తుంది.వేసవి కాలం లో నీటి లో చిన్న బెల్లం ముక్క వేసుకొని కలిపి తాగితే వేడి తగ్గుతుంది శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి రోజు భోజనం అయ్యాక చిన్న ముక్క బెల్లం తినటం వలన మన శరీరం లో జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరానికి  రక్తం కూడా  బాగా పడుతుంది.
అస్తమా వంటి సమస్యలకి వాడె మందుల లో బెల్లం ఓ పదార్ధం గా ఉంటుంది.
ఈ రోజు నుంచి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క నోట్లో వేసుకోండి .... 

నీరు తాగటం వలన చాల మంచి ప్రయోజానాలు ఉన్నాయ్ అని మీకు తెలుసా ?



ఈ రోజుల్లో నీరు తాగటానికి కూడా సమయం లేకుండా పోతుంది.నీరు తాగని వారు చాల ఇబ్బందులు ఎదురుకుంటారు.యురిన్ సమస్యలు తొలిగిపోతాయి.నిద్ర లేవగానే ముందు నీరు తాగటం అలవాటు చేసుకోండి.కనీసం ఒక అర లీటరు తాగటం మంచిది.శరీరం లో ఉండే మలినాలు తొలిగిపోతాయి.బరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.ఒక 20 నిముషాలు నడిచిన తరువాత మళ్లి నీరు తాగటం వలన రక్తప్రసరణ బాగా మెరుగు పడుతుంది.

ప్రయోజానాలు:

నీరు తాగటం వలన చర్మం మెరుస్తూ ఉంటుంది.
మొటిమలు బాధ కూడా తగ్గుతుంది.
నీరు ని కాచి తాగటం వలన టైఫాయిడ్ ,మలేరియ రోగాలు దరిచేరవు.
ఎక్కువ నీరు తాగటం వలన కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
మలబద్ధకం రాకుండా ఉంటుంది. 
రోజుకి 4 లీటర్ ల నీరు తాగటం మంచిది .
అన్నం తినే అర గంట సమయం ముందు నీరు తాగాలి.
తింటూ తాగకూడదు.